31న సిట్ ముందు హాజరవుతా : ప్రజ్వల్ రేవణ్ణ


31న సిట్ ముందు హాజరవుతానని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ వెల్లడించారు. ఈ కేసులో తాను పోలీసులకు సహకరిస్తానని, తనకు న్యాయ వ్యవస్థలపైన, చట్టాలపైన నమ్మకం ఉందని అన్నారు. అయితే తనపై తప్పుడు కేసుల పెట్టారంటూ ప్రజ్వల్ ఆరోపించారు. అలాగే ఈ ఆరోపణలన్నీ రాజకీయ కుట్రలో భాగంగానే వచ్చినవేనని అన్నారు. జేడీ (ఎస్) నాయకులు, పార్టీ కార్యకర్తలకు ఈ సందర్బంగా ప్రజ్వల్ క్షమాపణలు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న వేళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన రాసలీలల పెన్ డ్రైవ్ బయటపడ్డ విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ప్రతిపక్ష పార్టీలకు ఈ కేసు ప్రచారాస్త్రంగా మారింది .

No comments:

Post a Comment

3