బాలయ్యపై ట్రోల్స్ ఆపండి : నిర్మాత నాగ వంశీ !


గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ లో స్టేజిపైన నటి అంజలిని బాలయ్య తోసేసిన ఘటనపై వివాదం చేలరేగింది. బాలయ్యకు మహిళలను గౌరవించడం రాదనీ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో కూడా బాలయ్యపై ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి.అయితే ఈ ఈవెంట్ లో బాలయ్య మందు తాగి వచ్చారని, బాలయ్య పక్కన వున్నా మందు సీసాను హైలైట్ చేస్తూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై నిర్మాత నాగ వంశీ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మందు సీసా నిజం కాదు. అది వాటర్ బాటిల్ దానిలో మందు వున్నట్లుగా సీజి చేసి బాలయ్య పై ట్రోల్స్ చేస్తున్నారు.మేమంతా ఆ ఈవెంట్ లోనే వున్నాం కదా మాకు తెలీదా అక్కడ ఎం జరిగిందో అందుకే దయచేసి ఈ ట్రోల్స్ ఆపండి అని నాగవంశీ అన్నారు.

Post a Comment

0 Comments