భారత సైన్యానికి ఇండియన్ ఆయిల్ సంస్థ హైడ్రోజన్ బస్సులను అందించింది. ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ ఇండియన్ ఆర్మీ చీప్ మనోజ్ పాండేకు బస్సులను అందించారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని పరీక్షించడం మరియు అమలు చేయడం కోసం ఇరుపక్షాలు ఎంఓయూపై సంతకాలు చేశాయి. ఇండియన్ ఆయిల్ నుంచి ఢిల్లీలో వినియోగించడానికి ఇటీవల అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సును అందుకున్నప్పటికీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని మోహరించడంపై భారత సైన్యం దృష్టి సారించింది. పర్యావరణ పరిరక్షణలో ఇండియన్ ఆర్మీ కూడా ఓ అడుగు ముందుకు వేసి హైడ్రోజన్ బస్సులను సొంతం చేసుకుంది. ఇండియన్ ఆయిల్ కంపెనీ కూడా ఇలాంటి ఉత్పత్తులను పెంచుతోంది. భారత సైన్యంలో ప్రస్తుతం 15 ఫ్యూయెల్ సెల్ బస్సులు చేరాయి. ఇవన్నీ ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో నడుస్తాయి. రాబోయే రోజుల్లో ఇండియన్ ఆర్మీ మరిన్ని హైడ్రోజన్ బస్సులను వినియోగించే అవకాశం ఉంది.ఇతర నగరాల్లో కూడా వీటిని ఉపయోగించనుంది. ఇండియన్ ఆయిల్ కంపెనీ భారత సైన్యానికి అందించిన హైడ్రోజన్ బస్సులలో 37 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఇందులో ఫుల్ ట్యాంక్ చేయాలంటే 30కేజీల హైడ్రోజన్ నింపాల్సి ఉంటుంది. వీటిని ఒక ఫుల్ ట్యాంక్ హైడ్రోజన్‌తో 250 నుంచి 300 కిమీ వరకు నడపవచ్చు. దీన్ని బట్టి చూస్తే హైడ్రోజన్ బస్సులు మంచి పనితీరును అందిస్తాయని తెలుస్తోంది. మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఇతర వాహనాలతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ హైడ్రోజన్ బస్సులను నడపడానికి కావాల్సిన హైడ్రోజన్ కోసం ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2023 మార్చి 21న జరిగినట్లు సమాచారం. ఎన్టీపీసీ కంపెనీ దేశ ఉత్తర సరిహద్దులో గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ మైక్రోగ్రిడ్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత చుషుల్‌లో 200 కిలోవాట్ల సామర్థ్యం గల గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్‌ను నిర్మించారు. ఇవన్నీ హైడ్రోజన్ సరఫరాకు ఉపయోగపడతాయి.
0 Comments