సినీ ప్రేమికుల దినోత్సవ సందర్భంగా మల్టీప్లెక్స్ లో రూ.99 కే సినిమా టిక్కెట్లు !
మే 31న సినిమా లవర్స్ డే సందర్భంగా కేవలం రూ.99 ఖర్చుపెట్టి ఏ సినిమానైనా చూడొచ్చు. ఈ ఏడాది మే 31న సినీ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోనున్నట్లు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్నమల్టీప్లెక్స్ థియేటర్లలో కేవలం రూ.99 కే సినిమా టిక్కెట్ ని కొనుగోలు చేసి సినిమాను వీక్షించవచ్చని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే పలు కొత్త సినిమాలు థియేటర్లలో ఉండగా, శుక్రవారం మరికొన్ని కొత్త సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. MAI విడుదల చేసిన ఒక ప్రకటనలో PVR, INOX, Cinepolls, Mirage,Delight సహా దేశవ్యాప్తంగా 4,000 స్క్రీన్‌లు సినిమా ప్రేమికుల దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు చేతులు కలిపాయి. మీరు రాజ్‌కుమార్-జాన్వీ కపూర్ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'ని కేవలం రూ. 99తో చూడగలరు. జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావ్ ల మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మిస్టర్ అండ్ మిసెస్ మహిని మే 31న థియేటర్లలో విడుదల చేయనున్నారు. మే 31న కేవలం రూ. 99కి 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చని ధర్మా ప్రొడక్షన్స్ తెలిపింది.