నరేంద్ర మోడీపై పోలీసులకు ఫిర్యాదు !


హాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీపై సినీ దర్శకుడు లూయిట్ కుమార్ బర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గౌహతిలోని హాతీ గౌ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు నమోదు చేశారు. మోడీ వ్యాఖ్యలు గాంధీని దూషించేలా, పరువు తీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సినిమా ద్వారానే మహాత్మాగాంధీ ప్రపంచానికి తెలిసిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీశాయి. ఏబీపీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ విషయాన్ని వెల్లడించారు. 1982లో రిచర్డ్ అటెన్‌బరో చిత్రం గాంధీ విడుదలయ్యే వరకు మహాత్మాగాంధీ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదన్నదని మోడీ అన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org