Ad Code

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ పై షారుఖ్ ఖాన్ ప్రశంసలు !


మా ఛాంపియన్లు అద్భుతంగా ఆడారు. సమష్టి కృషితో విజేతగా నిలిచారని  ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ పై ఆ టీమ్ ఓనర్ షారుఖ్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రయాణంలో గంభీర్ మార్గదర్శకత్వం మరువలేనిది. కోచింగ్ సభ్యులు అంకిత భావంతో పనిచేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ప్లేయర్లందరూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రతి కోల్‌కతా నైట్ రైడర్స్ అభిమానికి కృతజ్ఞతలు. 2025లో మళ్లీ కలుద్దాం’ అంటూ షారుఖ్ ట్వీట్ చేశారు. కాగా, ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) ఛాంపియన్‌గా నిలిచింది. చెన్నై వేదికగా సన్ రైజర్స్ (ఎస్ఆర్‌హెచ్‌) తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచులో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. హైదరాబాద్ నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలోనే ఛేదించింది. 

Post a Comment

0 Comments

Close Menu