తిరుమల ఘాట్ రోడ్‌లో శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరుమలకు భక్తులతో వెళ్తున్న జీపు రెండో ఘాట్‌రోడ్‌లో ఏడో కిలోమీటరు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న పలువురు భక్తులకు స్వల్ప గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘాట్‌రోడ్ భద్రతా సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న జీపును పక్కకు తొలగించారు.
0 Comments