బస్సు లోయలో పడి 28 మంది దుర్మరణం


పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో ఏకంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 54 మంది ప్రయాణికులతో బస్సు దక్షిణ బలూచిస్తాన్‌లోని టర్బాట్‌ నగరం నుంచి ఉత్తరాన 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయల్దేరింది. ఈ క్రమంలోనే కొండ ప్రాంతంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొండ ప్రాంతంలో మలుపు వద్ద బస్సు అదుపు తప్పింది. దాంతో.. డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు పక్కకే ఉన్న లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో డ్రైవర్‌ సహా మొత్తం 28 మంది స్పాట్‌లోనే చనిపోయారు. సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం