ఇంగ్లాండ్ నుండి 100 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ బంగారాన్ని ఇంగ్లండ్‌లో కాకుండా భారతదేశంలో ఉంచారు. రాబోయే కొద్ది రోజుల్లో మరింత బంగారం భారతదేశానికి తిరిగి రాబోతోంది. రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుతం 822 టన్నుల బంగారం ఉంది. ఇందులో 100.3 టన్నుల బంగారాన్ని భారత్‌లో ఉంచగా, 413.8 టన్నుల బంగారం ఇప్పటికీ విదేశాల్లోనే ఉంది. ఇది కాకుండా, నోట్ల జారీ కోసం భారతదేశంలో 308 టన్నుల బంగారాన్ని ఉంచారు. గత కొన్నేళ్లుగా విదేశాల్లో భారతీయుల బంగారం నిల్వలు పెరుగుతుండడంతో రిజర్వ్ బ్యాంక్ దానిని తిరిగి దేశానికి తీసుకురావాలని నిర్ణయించింది. భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి మరిన్ని బంగారాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఉంచుతుంది. సాంప్రదాయకంగా, ప్రపంచంలోని చాలా దేశాలు తమ బంగారాన్ని లండన్‌లో ఉంచుతాయి. మన దేశంలో ఇప్పటి వరకు బంగారాన్ని లండన్ లో ఉంచుకునేది. కానీ ఇప్పుడు బంగారాన్ని పెద్ద మొత్తంలో దేశంలోనే ఉంచాలని నిర్ణయించుకుంది. రిజర్వ్ బ్యాంక్ విదేశాల నుంచి బంగారాన్ని తీసుకువస్తూనే, నిరంతరం కొత్త బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 34.3 టన్నుల కొత్త బంగారాన్ని, 2023-24లో 27.7 టన్నుల కొత్త బంగారాన్ని కొనుగోలు చేసింది. భారతదేశం నిరంతరం బంగారం కొనుగోలు చేయడం దాని ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని.. దాని ఆర్థిక భద్రతా నిర్వహణను బలోపేతం చేస్తుందని చూపిస్తుంది. ప్రపంచంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న అతి కొద్ది బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంక్ కూడా ఒకటి. బంగారాన్ని తిరిగి దేశానికి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని కూడా రద్దు చేసింది. అయితే ఈ బంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
0 Comments