చిరంజీవికి గోల్డెన్ వీసా అందజేసిన యూఏఈ !


ప్రముఖ సినీ నటుడు చిరంజీవి యూనైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ గోల్డెన్‌ వీసాను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుందన్న విషయం తెలిసిందే. ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ వీసాను జారీ అందిస్తోంది. గతంలో భారత చిత్రపరిశ్రమకు చెందిన షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, మమ్ముట్టి, టొవినో థామస్, ఇటీవల రజనీకాంత్ గోల్డెన్ వీసా అందుకున్నారు.


No comments:

Post a Comment

3