శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు ఘన స్వాగతం !
విదేశీ పర్యటనను ముగించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు 10 రోజు పాటు అక్కడ ఉల్లాసంగా గడిపారు. ఆయన స్వదేశానికి రావడంతో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చేరుకుని ఘన స్వాగతం పలికారు. కాగా, విశ్రాంతి కోసం ఈనెల 19న విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.