ప్లేయబుల్స్‌ను లాంచ్ చేసిన యూట్యూబ్ !


యూట్యూబ్ తన ప్లేయబుల్స్ ఫీచర్ ను అందరు యూజర్లకు రోల్ అవుట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు యూట్యూబ్ లోనే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లేయబుల్స్ సర్వీసును 2023 నవంబర్లో మొదటగా 30 ఆర్కేడ్ గేమ్స్ తో పరిచయం చేశారు. ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లలో ప్రీమియం సబ్ స్క్రైబర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉండేది. కానీ మార్చి 28వ తేదీ తర్వాత దీన్ని అందరు యూజర్లకు ఉచితంగా మార్చారు. ఇప్పుడు దీన్ని ఆడటానికి ఎటువంటి ప్రీమియం సబ్ స్క్రిప్షన్ అవసరం లేదు. ప్లేయబుల్స్ లైవ్ అయిన విషయాన్ని యూట్యూబ్ స్వయంగా బ్లాగ్ పోస్టు ద్వారా వెల్లడించింది. ‘యూట్యూబ్లో మీరు డైరెక్ట్గా ఆడగల ఫ్రీ గేమ్స్ కలెక్షన్ ఇది.’ అని బ్లాగ్ పోస్టులో పేర్కొంది. దీన్ని అందరు యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్లేయబుల్స్ సెక్షన్లో వినియోగదారులు 75 గేమ్స్ ఆడగలరు. దీనికి ఎటువంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. అయితే ఈ రోల్ అవుట్ దశల వారీగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొంతమంది యూజర్లకు ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు మాత్రం గేమ్ ట్రే ఐకాన్ కనిపించడం లేదు. దీన్ని బట్టి దశలవారీగా ఈ సర్వీస్ అందుబాటులోకి రానుందని అనుకోవచ్చు.

No comments:

Post a Comment

3