ముగిసిన ఏడో దశ ఎన్నికల ప్రచారం !


ఏడో దశ ఎన్నికల ప్రచారం నేడు ముగిసింది. జూన్ ఒకటో తేదీన 57 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. తుది దశ కావడంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. మొత్తం ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్‌సభ నియోజకవర్గాలు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ సీట్లకు పోలింగ్‌ ముగిసిన విషయం తెల్సిందే. ఏడో దశలో ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌లో 13 చొప్పున, పశ్చిమ బెంగాల్‌లో తొమ్మిది, బీహార్‌లో ఎనిమిది, ఒడిశా ఆరు, హిమాచల్‌ ప్రదేశ్‌లో నాలుగు, జార్ఖండ్‌లో మూడు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ లోక్‌సభ స్థానానికి శనివారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. వీటితోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ అదేరోజు ఓటింగ్‌ జరగనుంది. 

No comments:

Post a Comment

3