తెలంగాణలో బీజేపీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంచకుండా సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం వింతగా ఉందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంటే దేశంలో అత్యున్నత గౌరవం ఉన్న వాళ్ళు, అలాంటి వ్యవస్థను బీజేపీ కించపరచడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీ కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని చెప్పారు, ఎందుకు ఇంకా సీబీఐ ఆదేశాలు ఇవ్వలేదు అని మేం ప్రశ్నించారు. నిజంగా బీజేపీ ఆరోపణల్లో నిజం ఉంది అనుకుంటే యాపిల్ కంపెనీ పంపించిన మెసేజ్ పై సీబీఐ విచారణ చేపట్టాలన్నారు. సీబీఐతో బీజేపీ తమపై తాము ఎంక్వైరీ చేయించుకోవాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బయటికి నటిస్తున్నా.. లోపల కలివున్నారన్నది ఎన్నికల్లోనే స్పష్టం అయిపోయిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పైన తెలంగాణ బీజేపీ అనవసర రచ్చ చేస్తోందన్నారు. ట్యాపింగ్ పై రాష్ట్ర పోలీసులు సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. విచారణలో ట్యాపింగ్ దొంగలు బయటపడుతున్నారని.. అసలు దొంగలు త్వరలోనే దొరుకుతారన్నారు. అసలైన దొంగలు బయటపడతారనే భయం బీజేపీకి పట్టుకున్నట్లుందని.. కేసీఆర్, కేటీఆర్ ను కాపాడటానికి బీజేపీ నేతలు ధర్నా లు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర పోలీసులు సమగ్రంగా విచారణ జరుపుతున్నప్పుడు సీబీఐ అవసరం ఏముంది..? రాష్ట్ర పోలీసుల మీద బీజేపీ నాయకులకు నమ్మకం లేదా..? అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ పేరుతో బ్లాక్ మెయిల్ చేయాలని బీజేపీ భావిస్తుందా..? బీజేపీకి చిత్తశుద్ది ఉంటే ట్యాపింగ్ పైన కేంద్రం తో ఎందుకు విచారణ జరిపించలేదు..? అని మిడియాముఖంగా నిలదీశారు. ట్యాపింగ్ పైన అప్పట్లో మా రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. మా రేవంత్ రెడ్డి ఎంత మొత్తుకున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ట్యాపింగ్ తో పాటు కాళేశ్వరం అవినీతి పైన కేంద్రానికి అనేక ఫిర్యాదులు చేశాం. కేసీఆర్ పైన ఈగ వాలకుండా ఇంత కాలం బీజేపీ కాపాడుకుంటూ వచ్చింది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రభుత్వం పైన ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. జేపీ నడ్డా, అమిత్ షా, బండి సంజయ్ తో పాటు అనేక మంది నాయకులు కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని ప్రకటనలు గుప్పించి ఆ తర్వాత మాట్లాడక పోవడానికి కారణం ఏమిటి..? అని అడిగారు. మోదీ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేస్తోందనే తీవ్ర ఆరోపణలున్నాయి. కేంద్రం తమ ఫోన్లు ట్యాప్ చేస్తోందంటూ మా నాయకుడు రాహుల్ గాంధీతో పాటు అనేక మంది ఆరోపించారు. దేశం లోని ప్రత్యర్థి రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మోదీ పైన విమర్శలు వచ్చాయి. బీజేపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముందు తమ పైన వచ్చిన ఆరోపణల పైన సీబీఐతో విచారణ జరిపించుకోవాలని సవాల్ విసిరారు.
0 Comments