ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన మురికింటి వంశీ (22) ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అవసరం ఉండడంతో ఇంట్లో తెలియకుండా ఓ లోన్ యాప్ లో రూ. 10వేలు రుణం తీసుకున్నాడు. అయితే యాప్ నిర్వాహకులు అతడిని రూ. 1లక్ష కట్టాలంటూ వేధింపులకు గురిచేశారు. ఈ విషయం ఇంట్లో చెప్పడానికి భయపడిన వంశీ ఈ నెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు సందేశం పంపాడు. ఆ తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఆందోళన చెందిన కుటుంబీకులు రెండు రోజులుగా వంశీ కోసం గాలించారు. ఈ క్రమంలో తాడేపల్లిలో కృష్ణా నది వద్ద అతని మొబైల్ ఫోన్, బైక్, చెప్పులను గుర్తించారు. దాంతో నదిలో గాలింపు చేపట్టగా వంశీ మృతదేహం దొరికింది. తండ్రి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఇంజినీరింగ్ విద్యార్థి బలి !
by Telugu Lo Computer at May 27, 2024
Labels:
Andhra Pradesh
,
Criem
,
VIJAYAWADA
,
రూ. 10వేలు రుణానికి రూ. 1లక్ష కట్టాలంటూ వేధింపు
,
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఇంజినీరింగ్ విద్యార్థి బలి
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment