తెలంగాణలోని మెదక్ జిల్లా టెక్మాల్ మండలం దండువానికుంట తండాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి పనులు చేస్తున్న ఓ రైతు విద్యుత్ షాక్తో ప్రాణాలు కోల్పోయాడు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు లైన్మెన్ పై దాడికి దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తండాకు చెందిన రైతు విస్లావత్ అనిల్.. ట్రాన్స్ఫార్మర్ వద్ద క్యాసారం పనులు చేసే నిమిత్తం అక్కడికి వెళ్లారు. అయితే, అక్కడే ఉన్న లైన్మెన్ కిందనే ఉండి, రైతు అనిల్తో నిచ్చెన వేయించి ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కించారు. అనిల్ ట్రాన్స్ఫార్మర్ పైకెక్కి పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో ఆయనకు తీవ్రమైన షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో రైతు అనిల్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విద్యుత్ లైన్ ఆఫ్ చేయకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేయించడం వల్లే రైతు అనిల్ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారుల ముందస్తు నిర్లక్ష్యమే ఈ ప్రాణనష్టానికి కారణమని మండిపడ్డారు. ఈ ప్రమాదంతో తీవ్ర మనోవేదనకు గురైన మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడే ఉన్న లైన్మెన్ పై కుటుంబ సభ్యులు దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Home
Danduvanikunta Thanda
,
Family Members Assault Lineman
,
Farmer Loses Life Due to Electricity Officials' Negligence
,
Medak district
,
Tekmal Mandal
,
telangana
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు ప్రాణం బలి : లైన్మెన్ పై దాడికి దిగిన కుటుంబ సభ్యులు
Written By
