హైదరాబాద్ హైటెక్స్‌లో ఇవాళ, రేపు రెండు జరుగుతున్న సమాఖ్య బిజినెస్ సమ్మిట్-2026ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించి ప్రసంగిస్తూ పురాతన కాలంలో వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వ్యాపారం చేసేవారని, ఆధునిక యుగంలోనూ సమాఖ్యల అవసరం చాలా ఉందని వెల్లడించారు. కొత్త తరం అభివృద్ధి చెందాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో మున్నూరు కాపు సామాజికవర్గం నుంచి వివిధ హోదాల్లో రాణించారని, ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాదు, అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. సక్సెస్ స్టోరీస్‌ను సమాఖ్య నిక్షిప్తం చేసి కొత్త తరానికి అందించాలన్నారు. 2047 నాటికి స్వతంత్ర భారతం వందేళ్లు పూర్తి చేసుకోబోతోందని, ప్రధాని మోడీ 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఇందుకు రాష్ట్రాల సహకారం అవసరం అని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, అభివృద్ధి విషయంలో కాదన్నారు. అందుకే 2025లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసుకున్నాం. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్)గా అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ ఐటీ, సేవా రంగాలు, అత్యాధునిక టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తున్నామని సీఎం తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్)గా అభివృద్ధి చేసుకుంటున్నామని, ఈ ప్రాంతంలో తయారీ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ రంగాలను ప్రోత్సహిస్తామని, మిగిలిన గ్రామీణ ప్రాంతాలను రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్)గా అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, గ్రామీణ ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామని వివరించారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందని, దీన్ని 10 శాతానికి చేర్చాలనే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. నాలుగు వందల ఏళ్ల క్రితమే దేశవిదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు చార్మినార్ ల్యాండ్ మార్క్‌గా మారిందని, ఇపుడు హైటెక్ సిటీ అయిందని చెప్పారు. నూతన పారిశ్రామిక విధానంలో మీరంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు మనవాళ్లు కార్పొరేట్ కంపెనీలకు సర్వీస్ చేసే వైపు మాత్రమే ఉన్నారంటూ మన ప్రాంతానికి చెందిన వాళ్లు పెట్టుబడులు పెట్టి గ్లోబల్‌గా ఎదగాలన్నారు. ఒకసారి మనం ప్రపంచాన్ని గమనిస్తే మహిళల భాగస్వామ్యం ఉన్న దేశాలే ఆర్థికంగా బలపడ్డాయని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటూ తెలంగాణలో మహిళలకు 61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని, ఆర్టీసీ బస్సులకు, పెట్రోల్ బంకులకు, సోలార్ ప్లాంట్స్‌కు మహిళలను యజమానులను చేశామని వివరించారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు నా సూచన ఒక్కటే యువతతోపాటు మహిళలను ప్రోత్సహించండి అని అన్నారు. ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని, మంచి విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని, మీ పెట్టుబడులకు తమ భరోసా ఉంటుందని అన్నారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యంగా ముందుకు వెళదాం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమానికి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె.రఘు రామరాజు, ఎంపీలు డాక్టర్ కె.లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, దానం నాగేందర్, మున్నూరు కాపు ఫౌండేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జస్టిస్ భవానీప్రసాద్, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్, తదితరులు హాజరయ్యారు.
Home
CM Revanth Reddy at the 'Samakhya Business Summit' Inauguration
,
develop the state by categorizing it into three segments Cure
,
Federations Remain Crucial Even in the Modern Era
,
Pure
,
Rare
,
telangana
ఆధునిక యుగంలోనూ సమాఖ్యల అవసరం చాలా ఉంది : హైటెక్స్‌లో సమాఖ్య బిజినెస్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
Written By
