అమెరికాలో భారతీయ యువతి దారుణ హత్య !
అ మెరికాలో భారతీయ యువతి నిఖిత గోడిశాల దారుణ హత్యకు గురయ్యారు. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మకు చెందిన అపార్ట్‌మెంట్‌లో కత్తిపోట్లకు గురయ్యారు. రక్తపుమడుగులో కనిపించారు. నిఖితను చంపిన అనంతరం అర్జున్ శర్మ భారత్‌కు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు కేసు నమోదు చేసి, దర్యాప్ చేపట్టారు. అర్జున్ శర్మపై ఫస్ట్-డిగ్రీ, సెకండ్-డిగ్రీ హత్య ఆరోపణలతో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఎల్లికాట్ సిటీలో నివసించే తన స్నేహితురాలు నిఖిత కనిపించట్లేదంటూ అర్జున్ శర్మ తొలుత హోవార్డ్ కౌంటీ పోలీస్ స్టేషన్ లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశాడు. ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు నమోదైంది. న్యూ ఇయర్ ఈవ్ నుండి అదృశ్యమైనట్లు పేర్కొన్నాడు. కొలంబియాలోని ట్విన్ రివర్స్ రోడ్‌లో ఉన్న తన ఫ్లాట్‌లో చివరిసారిగా ఆమెను చూసినట్లు పోలీసులకు వెల్లడించాడు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మిస్సింగ్ రిపోర్ట్ నమోదు చేసిన అదే రోజున అర్జున్ శర్మ భారత్‌కు బయలుదేరి వెళ్లినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో ప్రైమ్ సస్పెక్ట్ కింద అతనిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. హోవార్డ్ కౌంటీ డిటెక్టివ్ డ...