ఖమ్మంలో జరిగిన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్టీఆర్ కు అభిమానులు, చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారని తెలిపారు. వాళ్లందరికీ తన విజ్ఞప్తి ఒక్కటేనని, తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని చూసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలన్నారు. అదే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అన్నారు. తద్వారా తమ ఉమ్మడి శత్రువును రూపుమాపేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని టీడీపీని కోరినట్లయింది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఉండొద్దని తెలుగు దేశం పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను వంద మీటర్ల గొయ్యి తీసి పాతిబెట్టినప్పుడే ఎన్టీఆర్ కు నివాళి అని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ గద్దెలు దిగాలని, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలని, అప్పుడే నందమూరి తారకరామారావుకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్లం అవుతామన్నారు. బీఆర్ఎస్ ను బొందపెట్టల్సిన బాధ్యత మనమీద ఉందంటూ టీడీపీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి సూచించారు. మరోవైపు సొంత పార్టీ కాంగ్రెస్ ను వదిలి.. టీడీపీని, ఎన్టీఆర్ ను పొగుడుతూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి.
బీఆర్ఎస్ దిమ్మెలు కూలాల, అదే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి : సీఎం రేవంత్ రెడ్డి
Sunday, January 18, 2026
appeal to all of them is the same BRS strongholds must crumble CM Revanth Reddy telangana that would be the true tribute to NTR
No comments:
Post a Comment