Ad Code

హర్మూజ్ దాటిన భారత్‌కు చెందిన 7వ ఎల్‌పీజీ ట్యాంకర్ 'గ్రీన్ సాన్వి'


భారత్‌కు చెందిన 7వ ఎల్‌పీజీ ట్యాంకర్ 'గ్రీన్ సాన్వి' హర్మూజ్ జలసంధిని దాటి భారత్ వైపు కదిలింది. దీనిపై ఇరాన్ ప్రభుత్వం భారత్‌కు ఒక ప్రత్యేక సందేశాన్ని పంపింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. భారత్, ముఖ్యంగా గుజరాత్ తమ ఉమ్మడి చరిత్రలో కీలక స్థానాన్ని కలిగి ఉన్నాయని ఇరాన్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య ప్రత్యేకమైన అనుబంధం, చరిత్ర ఉందని ఇరాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ అసూయతో రగిలిపోతోంది. కొందరు పాకిస్తాన్ నేతలు తమ దేశానికి ఇలాంటి సందేశాలు రాలేదని ఓవైపు, భారత్‌తో మైత్రిని గుర్తుచేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ చేసిన పోస్ట్‌కు రిప్లై ఇస్తూ ఇరాన్ కాన్సులేట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హర్మూజ్ జలసంధి ద్వారా ఎల్‌పీజీ ట్యాంకర్ ప్రయాణించడాన్ని భారత్ దౌత్య విజయం అని హర్ష్ సంఘ్వీ అభివర్ణించారు. దీనిపై స్పందించిన ఇరాన్ కాన్సులేట్ జనరల్.. 'మా ఉమ్మడి చరిత్రలో భారత్ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. శతాబ్దాల కిందట ఇక్కడి ప్రజలు మా దేశాన్ని సంతోషంగా ఆహ్వానించారు' అని పేర్కొంది. సుమారు 4,000 ఏళ్ల కిందట సింధు లోయ నగరాలను పర్షియన్ తీరంతో అనుసంధానించిన గుజరాత్‌లోని పురాతన ఓడరేవు లోతల్‌ను ఈ సందర్భంగా వారు ప్రస్తావించడం విశేషం. 'ఈ విడదీయలేని బంధాన్ని ప్రాతిపదికగా తీసుకుని, స్నేహం, సహకార సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాము' అని ఇరాన్ తెలిపింది. ఇప్పటివరకు 6 ఎల్‌పీజీ నౌకలు హర్మూజ్ జలసంధిని దాటి భారత్‌లోని ఓడరేవులకు చేరుకున్నాయి. ప్రపంచ చమురు అవసరాలలో 5వ వంతు ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది. ప్రస్తుతం సుమారు 17 భారత నౌకలు హర్మూజ్ పశ్చిమ భాగంలో చిక్కుకుపోయాయని సమాచారం. ఈ మార్గం మూతపడటంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగి, బ్యారెల్‌కు సుమారు 100 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల కిందట బ్యారెల్ ధర ఏకంగా 150 డాలర్లకు సైతం చేరి, తరువాత దిగొచ్చింది. ఇరాన్ ఒకవైపు శత్రు దేశాల నౌకలు హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లకుండా ఆంక్షలు విధించింది. కొన్ని దేశాల నుంచి మిలియన్ డాలర్ల టోల్ ట్యాక్స్ వసూలు చేస్తోంది. మరోవైపు 5 మిత్రదేశాలైన భారత్, రష్యా, చైనా, ఇరాక్, పాకిస్తాన్‌ల కోసం ఇరాన్ ప్రభుత్వం ఈ కారిడార్‌ను తెరిచి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. 

Post a Comment

0 Comments

Close Menu