నిద్రలేమి వల్ల వచ్చే మతిమరుపును కాఫీ దూరం చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో నిద్ర లేకపోయినా కాఫీ తాగిన ఎలుకలు చాలా చురుగ్గా ఉండి పాత విషయాలను గుర్తుపెట్టుకున్నాయట!. కాఫీ కేవలం నిద్రను ఆపడమే కాదు, దెబ్బతిన్న మెదడు కణాలను రిపేర్ చేయడానికి కూడా పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. నిద్ర సరిగ్గా లేకపోతే మెదడులోని జ్ఞాపకశక్తికి సంబంధించిన కణాలు దెబ్బతింటాయి. పరిశోధనలో భాగంగా కొన్ని ఎలుకలకు నిద్ర లేకుండా చేశారు. అవి ఇతర ఎలుకలను గుర్తించడంలో ఇబ్బంది పడ్డాయి. అయితే, నిద్రలేమికి గురయ్యే ముందు వారం రోజుల పాటు కెఫీన్ ఇచ్చిన ఎలుకలు మాత్రం చాలా చురుగ్గా ఉండి, ఎవరినీ మర్చిపోలేదు. సాధారణంగా నిద్ర తక్కువైతే మెదడులో ‘అడెనోసిన్’ అనే రసాయనం పెరిగి మెమరీ సర్క్యూట్లను బలహీనపరుస్తుంది. కాఫీలోని కెఫీన్ ఈ అడెనోసిన్‌ను అడ్డుకుంటుంది. అంతేకాకుండా, దెబ్బతిన్న మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌ను పెంచి జ్ఞాపకశక్తి తిరిగి పుంజుకునేలా చేస్తుందని సైంటిస్టులు గుర్తించారు.ఈ ప్రయోగాలు ఎలుకలపై జరిగాయి కాబట్టి మనుషులకు ఇది ఎంతవరకు వర్తిస్తుందో తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక మనిషి రోజుకు 400 మిల్లీగ్రాముల (సుమారు 4 కప్పులు) కంటే ఎక్కువ కెఫీన్ తీసుకోకూడదు. అతిగా తాగితే కొన్ని నష్టాలు తప్పవు. కాఫీ చర్మంలో ‘కొల్లాజెన్’ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల ముఖంపై ముడతలు వచ్చి త్వరగా ముసలితనం కనిపిస్తుంది. రోజువారీ కాఫీ పరిమితి దాటితే రక్తపోటు పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అతిగా కెఫీన్ తీసుకోవడం వల్ల చేతులు వణకడం, గుండె వేగంగా కొట్టుకోవడం మరియు అనవసరమైన ఆందోళన కలుగుతాయి. కాఫీ కేవలం మనల్ని నిద్రలేకుండా మేల్కొనేలా చేసే పానీయం మాత్రమే కాదు, నిద్రలేమి వల్ల దెబ్బతినే మన జ్ఞాపకశక్తిని కాపాడే శక్తి కూడా దీనికి ఉందని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది.
ホーム
/
The Pros and Cons
/
కాఫీ సేవనం -మంచి - చెడులు
Saturday, April 4, 2026
arogyam Coffee Consumption experiments conducted on mice by researchers at the National University of Singapore food Health Tips science The Pros and Cons
No comments:
Post a Comment