Ad Code

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి హంటర్ 350


రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి హంటర్ 350లో కొత్త వేరియంట్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రెండు కలర్స్ కూడా వచ్చాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీలో బేస్ వేరియంట్ రెట్రో. అయితే దీన్ని ఆపేసిన కంపెనీ కొత్తగా బేస్ ప్రీమియం వేరియంట్ తాజాగా పరిచయం చేసింది. అదే ఈ హంటర్ 350 మోడల్. తాజాగా ఇందులో రెండు కలర్స్ తో వేరియంట్ ను తీసుకువచ్చింది. డాపర్ ఆరెంజ్, డాపర్ గ్రీన్ కలర్స్ లో ఈ కొత్త బైక్స్ వచ్చాయి. ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయని కంపెనీ.. ధర మాత్రం భారీగా పెంచింది. హంటర్ 350 బేస్ ప్రీమియం ధర రూ.1.75 లక్షల నుంచి రూ. 1.80 లక్షల మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర ప్రకారం మాత్రమే. ఈ బైక్ లో వెనుక డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అందిస్తున్నారు. అప్పట్లో దీని పాత మోడల్ లో స్పోక్ వీల్స్ ఉండేవి. అయితే ఇప్పుడు అల్లాయ్ వీల్స్ అందిస్తున్నారు. ఎప్పటి లాగా ఐదు గేర్లు ఈ బైక్ కు ఉంటాయి. 20.2 BHP పవర్, 27 ఎన్ఎం టార్క్ రిలీజ్ చేస్తుంది. 349 సీసీ ఇంజన్, సింగిల్ సిలిండర్ అందిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu