3

దుబాయ్ బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్స్ లక్కీ డ్రా విజేత నాంపెల్లి రాజమల్లయ్య !


హైదరాబాద్ కు చెందిన నాంపెల్లి రాజమల్లయ్య దుబాయ్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఇతనికి తరచూ లాటరీ టికెట్ కొనే అలవాటు ఉంది. అలవాటులో భాగంగా బిగ్ టికెట్ అనే లాటరీ టికెట్ కొన్నాడు. ఈసారి అదృష్టం వరించి అతనికి లాటరీ తగిలింది. ఇటీవల అనౌన్స్ చేసిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రా లో రాజమల్లయ్య విజేతగా నిలిచాడు. ఈ లక్కీ డ్రా లో రాజమల్లయ్య ఒక మిలియన్ దిర్హామ్ ( రూ. 2 కోట్ల 32 లక్షల 76వేల 460 ) గెలుపొందాడు. ఓ బిల్డింగ్ కి వాచ్ మెన్ గా పనిచేస్తున్న రాజమల్లయ్య 30ఏళ్ళ నుండి లాటరీ కొంటున్నట్లు తెలిపాడు. ఎట్టకేలకు లాటరీ గెలుపొందడంతో రాజమల్లయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ప్రైజ్ మనీని తాను టికెట్ కొనడానికి సాయం చేసిన స్నేహితులతో పంచుకుంటానని, మిగతా మొత్తాన్ని కుటుంబ భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని తెలిపాడు. 

Related Post

Previous
Next Post »