హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ అత్యవసర విభాగం వద్ద సిబ్బంది ఆందోళనకు దిగారు. నిమ్స్ వర్కర్‌ను పంజాగుట్ట పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ సిబ్బంది ఆందోళన చేపట్టారు. గురువారం ఓ రోగి ఎంఆర్‌ఐ స్కానింగ్ కోసం నిమ్స్‌కు వచ్చారు. ఈ క్రమంలో స్కానింగ్ పూర్తయిన తర్వాత చూడగా రోగి బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో అతను విధుల్లో ఉన్న వర్కర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా నిమ్స్ వర్కర్‌ను పంజాగుట్ట పోలీసులు కొట్టారని ఇతర సిబ్బంది ఆరోపించారు. చివరకు ఆ బంగారు గొలుసు రోగి వద్దే లభించింది. దీంతో పూర్తిగా నిర్దారణకు రాకుండానే దొంగతనం పేరుతో వర్కర్‌ను పోలీసులు కొట్టారని అత్యవసర విభాగం వద్ద సిబ్బంది నిరసనకు దిగారు.
0 Comments