బిర్యానీ ఆకుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. రాత్రివేళ బిర్యానీ ఆకులను కాల్చి ఇంట్లో పొగ వేయడం అనేది పురాతన ఆయుర్వేద పద్ధతి. ఈ పొగ గాలిని శుద్ధి చేయడమే కాకుండా, మనస్సును కూడా ప్రశాంతపరుస్తుంది, దోమలను తరిమికొడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలకు బిర్యానీ ఆకులు ఒక చక్కటి పరిష్కారం. రాత్రి పడుకునే ముందు రెండు బిర్యానీ ఆకులను కాల్చి పొగ వేస్తే, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. బిర్యానీ ఆకుల పొగలోని సుగంధం మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది, విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. దీంతో నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగలో ఉండే ప్రత్యేక సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉంటే, మన శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి సమర్థవంతంగా పోరాడగలదు. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందడానికి ఇది ఒక సహజమైన మార్గం. బిర్యానీ ఆకుల పొగ గాలిలోని హానికరమైన కణాలు, బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తుందని నమ్ముతారు. దీనివల్ల గాలి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు, ఈ పొగ గదిలోని దుర్వాసనను కూడా తొలగిస్తుంది. సహజసిద్ధమైన పద్ధతిలో గాలిని శుద్ధి చేయాలంటే బిర్యానీ ఆకులు ఒక చక్కటి పరిష్కారం. వీటిని కాల్చినప్పుడు వచ్చే సుగంధం దోమలు, ఇతర కీటకాలను తరిమికొడుతుంది. దీంతో ఇల్లు ఆహ్లాదకరంగా, కీటకాలు లేని ప్రదేశంగా మారుతుంది. బిర్యానీ ఆకుల్లో యూజీనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే బిర్యానీ ఆకుల పొగను పీల్చడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గే అవకాశముంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఈ పొగ పీల్చడం వల్ల సైనస్‌లు క్లియర్ అవ్వడమే కాకుండా, శ్వాసకోశ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలకు ఇది కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆకుల సుగంధం మూడ్, కాగ్నిటివ్ ఫంక్షన్‌పై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. ఆకుల్లోని లినలూల్ సమ్మేళనానికి మూడ్-బూస్టింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
బిర్యానీ ఆకుల పొగ - ఆరోగ్య ప్రయోజనాలు !
by Telugu Lo Computer at December 27, 2024
Labels:
arogyam
,
ayurvedam
,
Health Tips
,
గాలిని శుద్ధి చేయడమే కాకుండా
,
దోమలను తరిమికొడుతుంది
,
బిర్యానీ ఆకుల పొగ - ఆరోగ్య ప్రయోజనాలు
,
మనస్సును కూడా ప్రశాంతపరుస్తుంది
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment