Ad Code

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి


మెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ తుది శ్వాస విడిచారు. యునైటెడ్ స్టేట్స్‌కి 39వ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన జిమ్మీ కార్టర్, రెండు నెలల క్రితమే 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1924, అక్టోబర్ 1న జన్మించిన జిమ్మీ కార్టర్, 2024, డిసెంబర్ 29న తుది శ్వాస విడిచారు. అమెరికా చరిత్రలో ఎక్కువ రోజులు బతికిన ప్రెసిడెంట్‌గా చరిత్ర నెలకొల్పాడు. 2002లో నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకున్నారు. 1946లో యూఎస్ నవల్ అకాడమీలో చేరిన జిమ్మీ కార్టర్, ఆ తర్వాత యూఎస్ నేవీ సబ్‌మెరైన్ సర్వీస్‌లో పని చేశారు. మిలిటరీ సేవలు ముగించుకున్న తర్వాత తన కుటుంబంతో కలిసి పల్లీల వ్యాపారాన్ని మొదలెట్టారు. అమెరికాలో పెరిగిపోతున్న జాత్యాహంకారాన్ని చూసి తట్టుకోలేక రాజకీయాలవైపు అడుగులు వేశారు. 1976లో రిప్లబిక్ పార్టీ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్‌పై గెలిచి, యూఎస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు జిమ్మీ కార్టర్. జిమ్మీ కార్టర్ భార్య రోసలెన్ స్మిత్, 2023లో 96 ఏళ్ల వయసులో మృతి చెందింది. జిమ్మీ కార్టర్‌, స్మిత్ దంపతులకు నలుగురు సంతానం. జిమ్మీ కార్టర్ కొడుకు జాక్ కార్టర్, యూఎస్‌లో బిజినెస్‌మ్యాన్‌గా ఉన్నాడు. 1977 నుంచి 1981 వరకూ యూఎస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జిమ్మీ కార్టర్, జార్జియా గవర్నర్‌గా కూడా వ్యవహరించారు. అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో జిమ్మి కార్టర్.. మానవ హక్కుల పరిరక్షణతో పాటు పర్యావరణ సంక్షేమం కోసం కృషి చేశాడు. 1978లో ఇజ్రాయిల్, ఈజిప్ట్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంలో జిమ్మీ కార్టర్ కీలక పాత్ర పోషించారు. 

Post a Comment

0 Comments

Close Menu