ఖర్జూరాలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అన్ని విధాల మేలు చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు మొదలు బీపీ, గుండె ఆరోగ్యం వంటి సమస్యలను దరిచేరనివ్వడకుండా కాపాడడంలో ఖర్జూర కీలక పాత్ర పోషిస్తుంది. మోతాదుకు మించి ఖర్జూరాలను ఆహారంలో భాగం చేసుకుంటే కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఖర్జూరాల్లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ పేషెంట్స్‌కి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి హైపోగ్లైసీమియా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఖర్జూరాల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. దీంతో ఊబకాయం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఖర్జూరాలను మోతాదుకు మించి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఖర్జూరాలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కొందరిలో ఖర్జూరాలను అధికంగా తీసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చర్మం ఎర్రబడడం, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖర్జూరాలను మోతాదుకు మించి తీసుకుంటే దంత సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఖర్జూరాల్లో ఉండే అధిక చక్కెర కంటెంట్ దంతాలపై ప్లాక్ పేరుకుపోయి దంతాలు క్షీణించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
0 Comments