పవన్ కల్యాణ్‌తో దిల్ రాజు భేటీ !



ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్ రాజు సమావేశమయ్యారు. దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించేందుకు దిల్ రాజు ఏపీ సెక్రటేరియట్‌కు వెళ్లారు. జనవరి 10న రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ సినిమా గురించి ముందుగా చర్చించుకున్నారు. అటుపై విజయవాడలో నిర్వహించే ప్రీ రిలీజ్ వేడుకకు రావాలని పవన్ కల్యాణ్‌ని దిల్ రాజు కోరడం జరిగింది. అయితే ఆదివారం దిల్ రాజు ప్రకటించినట్లుగా ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా హిస్టరీలో నిలిచిపోయేట్లుగా ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని కీలక వ్యక్తిగా ఉన్న దిల్ రాజు ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం సర్రత్రా ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్‌తో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకను విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించాలని ఆ ఈవెంట్‌కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ని చీఫ్ గెస్టుగా ఆహ్వానిస్తామని చెప్పినట్లుగా దిల్ రాజు సోమవారం పవన్ కల్యాణ్ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org