జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు !


క్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రైల్వే సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ స్టేషన్‌లో ఇక నుంచి 15 నిమిషాలు ముందుగానే బయలుదేరుతుంది. పాత షెడ్యూల్‌ ప్రకారం విజయవాడ స్టేషన్‌లో ఉదయం 6.15 గంటలకు బయలుదేరాల్సిన రైలు మార్చిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 6 గంటలకే బయలుదేరుతుంది. నిత్యం విజయవాడ నుంచి విశాఖ వెళ్లే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org