Ad Code

యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం కింద శివలింగం !


లక్నో నగరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం కింద శివలింగం ఉందని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. అక్కడ శివలింగం ఉందని తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఎద్దేవా చేశారు. సీఎం అధికారిక నివాసం కింద తప్పకుండా తవ్వకాలు జరపాలని బీజేపీ ప్రభుత్వాన్ని అఖిలేష్ డిమాండ్ చేశారు. లక్నోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. సంభల్ పట్టణంలో తవ్వకాల పేరుతో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ప్రజలను ఇబ్బందిపెడుతోందన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తన బొందను తానే తవ్వుకుంటోందని అఖిలేష్ మండిపడ్డారు.

Post a Comment

0 Comments

Close Menu