Ad Code

మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు !


మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం తన 'మన్‌కీ బాత్‌'లో మహా కుంభమేళాను ప్రస్తావించారు. దీన్ని ఐక్యతా మేళాగా పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, సంస్కృతి, భద్రత, ఆధునికతల మేళవింపుగా ఈ వేడుకను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సాంస్కృతిక శాఖ తెలిపింది. భద్రత కోసం పారామిలిటరీ బలగాలు సహా 50 వేల మంది సిబ్బంది మోహరింపు, కృత్రిమ మేధ సాంకేతికతతో కూడిన 2700 కెమెరాల ఏర్పాటు.. తొలిసారి అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం, పోలీస్ స్టేషన్‌లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లు, 56 మంది సైబర్ వారియర్ల బృందం, కుంభమేళా సమాచారం తెలుసుకునేందుకు 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్‌బాట్, శస్త్రచికిత్స, రోగనిర్ధరణ సౌకర్యాలతో కూడిన తాత్కాలిక ఆసుపత్రులు. ఏకకాలంలో 200 మందికి చికిత్స అందించగల భీష్మ క్యూబ్‌ ఏర్పాటు,  'నేత్ర కుంభ్' శిబిరం ద్వారా ఐదు లక్షల మంది యాత్రికులకు కంటి పరీక్షలు, మూడు లక్షలకుపైగా కళ్లద్దాల పంపిణీకి చర్యలు, భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు వేలాది టెంట్లు, షెల్టర్లతో మహా కుంభ్‌నగర్‌ ఏర్పాటు.. గూగుల్‌ మ్యాప్స్‌తో అనుసంధానం, అండర్‌వాటర్‌ డ్రోన్లు, మార్గనిర్దేశం చేసేందుకు హిందీ, ఇంగ్లీష్‌, ప్రాంతీయ భాషలతో కూడిన 800 బోర్డుల ఏర్పాటు, 92 రోడ్ల పునర్నిర్మాణం, 17 ప్రధాన రహదారుల సుందరీకరణ పనులు తుదిదశకు.. అదేవిధంగా 30 తేలియాడే వంతెన (పాంటూన్‌ బ్రిడ్జ్‌)ల నిర్మాణం, అవాంఛనీయ ఘటనలు జరిగితే సకాలంలో స్పందించేలా పకడ్బందీ ఏర్పాట్లు. అత్యాధునిక బహుళ-విపత్తు ప్రతిస్పందన వాహనాల మోహరింపు.  అగ్నిప్రమాదాలను కట్టడి చేసేందుకు నాలుగు ఆర్టిక్యులేటింగ్ వాటర్ టవర్స్ వాహనాలు, లైటింగ్ కోసం సౌరశక్తి, పునర్వినియోగ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించడం, ఒకేసారి ఉపయోగించే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌పై నిషేధం. దేశ సాంస్కృతిక వారసత్వం, వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయాగ్‌రాజ్‌లో 'కళాగ్రామ్' ఏర్పాటు

Post a Comment

0 Comments

Close Menu