డిసెంబర్లో బంగారం, వెండి ధరలు ఎక్కువగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈరోజు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,460కి చేరుకుంది. ఇది నిన్నటి ధరలతో పోల్చి చూస్తే 340 రూపాయల తగ్గింది. ఇక ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,088కి చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,710 స్థాయికి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70,318కు చేరుకుంది. కిలో వెండి రూ. 130 తగ్గి రూ. 89,860 స్థాయికి చేరింది. బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ద్వారా హాల్ మార్క్ ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. క్యారెట్ 24కి మించదు, క్యారెట్ ఎక్కువైతే బంగారం స్వచ్ఛంగా ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది.
0 Comments