యెమెన్‌లోని సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ ప్రాణాలతో బయటపడ్డాడు. టెడ్రోస్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం ఎక్కేందుకు వెయిట్ చేస్తున్న క్రమంలో ఈ వైమానిక బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది ఎయిర్ పోర్టు సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన పలువురు తీవ్రంగా తప్పుబట్టారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలన్నారు. పౌరులు, మానవతా కార్మికులే లక్ష్యంగా దాడులు చేయకూడదని సూచిస్తున్నారు. ఖైదీల విడుదల, యెమెన్‌లో ఆరోగ్యం, మానవతా పరిస్థితులపై చర్చలు జరిపేందుకు ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో ట్రెడోస్ అధానోమ్ అక్కడికి వెళ్లారు. చర్చల అనంతరం తిరిగి సనా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్లైట్ కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో ఒక్కసారి బాంబు దాడి జరిగింది. దీంతో ఒక్కసారి ఆందోళనకు గురైనట్లు చెప్పారు ట్రెడోస్. దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండించారు.
యెమెన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో ప్రాణాలతో బయటపడ్డ టెడ్రోస్ అధానోమ్ !
by Telugu Lo Computer at December 28, 2024
Labels:
international
,
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్
,
యెమెన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో ప్రాణాలతో బయటపడ్డ టెడ్రోస్ అధానోమ్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment