Ad Code

రిలయన్స్‌ చేతికి కర్కినోస్‌ హెల్త్‌కేర్‌ !


ఆంకాలజీ సేవలు అందించే హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫాం కర్కినోస్‌ను రూ.375 కోట్లకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెక్నాలజీ ఆపరేటెడ్‌ శనివారం తెలిపింది. రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ బిజినెస్‌ వెంచర్స్‌ లిమిటెడ్ అవసరమైన షేర్ల కేటాయింపుతో కర్కినోస్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కొనుగోలును పూర్తి చేసిందని రిలయన్స్‌ సంస్థ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది. కర్కినోస్‌ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం/నిర్ధారించడం వంటి సాంకేతికతతో నడిచే వినూత్న పరిష్కారాలను అందించే సంస్థగా పేరు గాంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ టర్నోవర్‌ దాదాపు రూ.22 కోట్లుగా ఉంది. లాభదాయక సంస్థగా కొనసాగుతూ.. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, ప్రభావ వంతంగా చికిత్స చేయడం వంటి వాటిపై కర్కినోస్‌ దృష్టి సారించింది. కర్కినోస్‌ ఆంకాలజీ (టెస్టింగ్‌, రేడియేషన్‌ థెరపీ మొదలైన) సేవలను అందించడానికి అనేక ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ సంస్థ 2023 డిసెంబర్‌ వరకు దాదాపు 60 ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది. రిలయన్స్‌ గ్రూప్‌కు సంబంధించిన ఆరోగ్య సేవల వ్యాపార పోర్ట్‌ఫోలియో విస్తరణకు కర్కినోస్‌ కొనుగోలు కూడా సహాయపడుతుందని రిలయన్స్‌ తన ఫైలింగ్‌లో పేర్కొంది. లావాదేవీకి అదనపు ప్రభుత్వ లేదా నియంత్రణ ఆమోదాలు అవసరం లేదని కూడా తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu