మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు ?


ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ తాజా నివేదిక ప్రకారం టెలికం కంపెనీలు తమ టారిఫ్ రేట్లను వచ్చే ఏడాది డిసెంబరులో 15% వరకు పెంచే అవకాశముంది. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఐదేళ్లలో టెలికం రంగంలో మూడు సార్లు టారిఫ్ రేట్లు పెంచారు. 2019 సెప్టెంబర్‌లో రూ.98గా ఉన్న రీఛార్జ్ ప్లాన్ 2024 సెప్టెంబర్ నాటికి రూ.193కు చేరింది. వినియోగదారులపై ఇదే సమయంలో ఆర్థిక భారమూ భారీగా పెరిగింది. కంపెనీలు తమ ఆవరేజ్ రేవెన్యూ పర్ యూజర్ స్థాయిలను పెంచుకునేందుకు టారిఫ్ పెంపు కీలక మార్గంగా చూస్తున్నాయి. ఈ పెంపు వల్ల వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు తక్కువ ధరల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఆశించగా, ఇప్పుడు ధరలు పెరగడం వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మధ్య తరగతి వినియోగదారులు, తక్కువ ఆదాయవర్గాల వారికి ఇది ప్రతికూలంగా మారనుంది.

No comments:

Post a Comment

3