మహిళా ఉద్యోగి స్పోర్ట్స్ షూ వేసుకుని వచ్చిందనే నెపంతో ఉద్యోగం నుంచి తీసేసిన సంస్థ : కంపెనీకి భారీ నష్టపరిహారం విధించిన ట్రిబ్యునల్ !


బ్రిటన్‌లోని ఓ సంస్థ మహిళా ఉద్యోగి స్పోర్ట్స్ షూ వేసుకుని ఆఫీస్‌కు వచ్చిందనే నెపంతో ఏకంగా ఉద్యోగంలో నుంచి తీసేసింది. దీంతో ఆ మహిళ సదరు యాజమాన్యంపై కోర్టుకు ఎక్కింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రిటన్‌కు చెందిన 20 ఏళ్ల ఎలిజబెత్ బెనాస్సీ ఓ సంస్థలో పని చేస్తోంది. ఆమె తన ఆఫీస్‌కు వెళ్లేటపుడు స్పోర్ట్స్ షూ వేసుకుని వెళ్లింది. దీంతో ఆమెను బాస్ ఉద్యోగంలో నుంచి తీసేశాడు. దీంతో ఆమె సదరు సంస్థ యాజమాన్యంపై కోర్టులో పిటిషన్ వేసింది. చాలా మంది ఉద్యోగులు ఆ తరహా షూలతోనే రోజూ ఆఫీస్‌కు వస్తారని, యాజమాన్యం తనను టార్గెట్ చేసిందని, అందుకే ఆ సాకు చూపి తనను ఉద్యోగంలో నుంచి తీసేసిందని పేర్కొంది. మొత్తం వాదనలు విన్న న్యాయమూర్తి ఎలిజబెత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు. సౌత్ లండన్ ట్రిబ్యునల్ బెనాస్సీ పక్షం వహించి, ఉద్యోగికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సదరు యాజమన్యం కావాలనే ఎలిజబెత్‌ను టార్గెట్ చేసినట్టు నిర్ధారణకు వచ్చింది. కంపెనీకి భారీ నష్టపరిహారం విధించింది. సదరు సంస్థ ఎలిజబెత్‌కు 30,000 పౌండ్లు చెల్లించాలని ఆదేశించింది. 

No comments:

Post a Comment

3