మోరాయించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ : ఈ నెలలో మూడోసారి !


ఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మంగళవారం ఉదయం మరోసారి మోరాయించింది. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే వెబ్‌సైట్ మొరాయించడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహణ పనులు జరుగుతున్నాయని, అందువల్ల తదుపరి గంట వరకు టిక్కెట్ బుకింగ్‌లు, కాన్సిలేషన్లు చేసుకోవడం వీలుపడదని వెబ్‌సైట్‌లో నోట్ పెట్టింది. ''తదుపరి గంట వరకు బుకింగ్, క్యాన్సిలేషన్లు చేసుకోవడం కుదరుదు, ఈ అంతరానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం, క్యాన్సిలేషన్ లేదా టీడీఆర్ ఫైల్ చేయాలనుకుంటే కస్టమర్ కేర్ నెంబర్లు 14646,08044647999, 08035734999ను లేదా etickets@irctc.co.inకు మెయిల్ ద్వారా సంప్రదించాలి'' అని సూచించింది. ఇలా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ డౌన్ కావడం ఈ నెలలో ఇది మూడోసారి కావడం గమనార్హం. డిసెంబరు 26న ఏకంగా గంటన్నర పాటు బుకింగ్స్ నిలిచిపోయాయి. అంతకు ముందు డిసెంబర్ 9 న కూడా వెబ్‌సైట్ రెండు గంటలపాటు నిలిచిపోయింది. దీంతో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడంలో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కూడా కొత్త ఏడాది సందర్బంగా టూర్ ప్లాన్ చేసుకున్నవారు.. జర్నీ కోసం టిక్కెట్ బుక్ చేసుకుందామంటే బుకింగ్స్ నిలిచిపోయాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org