వార్షిక రిటర్న్‌లు దాఖలు గడువు జనవరి 31 వరకు పొడిగింపు


ఐటీ వార్షిక రిటర్న్‌లు దాఖలు చేసేవారికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గడువు తేదీని పొడిగించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్తర్వుల ప్రకారం ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్న్‌లను దాఖలు చేయడానికి జనవరి 31, 2026 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు ముగుస్తుంది. అయితే.. ఫైలింగ్ వ్యవస్థలో వస్తున్న టెక్నికల్ ఇబ్బందులు, పండుగలు, ఇతర సెలవుల వల్ల రిటన్న్‌లు దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని కొన్ని వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులు దృష్టిలో ఉంచుకొని, కంపెనీలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైలింగ్‌లను అదనపు రుసుము చెల్లించకుండా గడువు తేదీని పొడిగించాలని అధికారికంగా నిర్ణయం తీసుకుంది. 

No comments:

Post a Comment

3