హైదరాబాద్ లో ఓ బాధితురాలని డిజిటల్ అరెస్ట్ పేరుతో కోటి 95 లక్షల 75 వేల రూపాయలను దుండగులు మోసం చేశారు. ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి కేటుగాళ్ల ఆట కట్టించారు. ఈ కేసులో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 13వ తేదీన డిజిటల్ అరెస్టుకు గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేటుగాళ్ల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే నిందితులు భావ్‌నగర్‌కు చెందిన సయ్యద్ సోయబ్, బెలీం అనాస్‌లను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అధికారులుగా నటించి మహిళను మోసగాళ్లు భయపెట్టారు. భర్తపై కేసు ఉందని అంటూ నేరస్తులు నకిలీ కాల్స్ చేశారు. కరెన్సీ వెరిఫికేషన్ పేరుతో ఆర్టీజీఎస్ ద్వారా డబ్బు బదిలీలు చేశారు. మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత దుబాయ్‌కు హవాలా మార్గంలో నగదు బదిలీ చేశారు. మొత్తం 22 సైబర్ కేసుల్లో నిందితులు ఇద్దరు బ్యాంక్ ఖాతాలు వాడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు సుమారుగా రూ.3.5 కోట్ల లావాదేవీలు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. నిందితుల దగ్గరి నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
3
Beranda
› Criem
› Cybercrime police arrest two accused
› technology
› telangana
› Two accused from Gujarat
› Woman duped of Rs 1.95 crore in 'digital arrest' scam
› డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళకు కుచ్చుటోపీ : ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
Subscribe to:
Post Comments (Atom)