Ad Code

మలేషియా ఓపెన్ స్టేడియంలో భారీ ఎత్తున జరిగిన జననాయగన్ ఆడియో లాంచ్ !


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్ ఆడియో లాంచ్ గత రాత్రి మలేషియాలోని ఓపెన్ స్టేడియంలో భారీ ఎత్తున జరిగింది. భారీ స్టేజ్, ఇంటర్నేషనల్ లైటింగ్ డిజైన్, వేలాది మంది అభిమానుల మధ్య దళపతి కెరీర్‌లో బిగ్గెస్ట్ ఆడియో లాంచ్ గా జననాయగన్ నిలిచింది. అభిమానుల కోసం ఈ ఈవెంట్ లో 'దళపతి కచేరి' సాంగ్ కు డాన్స్ చేసి ఫ్యాన్స్ ను విజయ్ అలరించాడు. పొలిటిక ల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో నే లాస్ట్ సినిమా. ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాలు వదిలేసి పూర్తి స్థాయి పొలిటికల్ లీడర్ గా మారనున్నాయి. విజయ్ సినిమాలకు స్వస్తి పలకబోతున్నాడు. చాలా ఏళ్లుగా తమిళ స్టార్ హీరోగా అగ్ర స్థాయిలో అభిమానులను అలరించించిన విజయ్ సినిమాల నుండి తప్పుకోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. విజయ్ సినిమాల నుండి తప్పుకోవడంతో కోలీవుడ్ సినిమా చరిత్రలో స్టార్ హీరో శకం ముగిసినట్లయింది. తమ హీరో చివరి సినిమాను భారీగా సెలెబ్రేట్ చేయాలని అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న జననాయగన్ భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.

Post a Comment

0 Comments

Close Menu