కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఓ పాత ఫోటోను షేర్ చేస్తూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలాన్ని ఆకాశానికెత్తారు. ఈ పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. దిగ్విజయ్ సింగ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో కోరా వెబ్‌సైట్‌కు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశారు. 1990వ దశకంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా ప్రమాణ స్వీకార కార్యక్రమ సమయంలో తీసిన ఫోటో అది. ఆ ఫోటోలో బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ సోఫాలో కూర్చుని ఉండగా, అప్పట్లో ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న నరేంద్ర మోడీ ఆయన పాదాల చెంత నేల మీద కూర్చుని ఉన్నారు. ఆ ఫోటోను ఉద్దేశించి దిగ్విజయ్ ఈ విధంగా రాసుకొచ్చారు. "ఈ ఫోటో చాలా ప్రభావవంతంగా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలో ఒక సాధారణ కార్యకర్త నేల మీద కూర్చునే స్థాయి నుండి ముఖ్యమంత్రిగా, ఆపై దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి. ఇది ఆ సంస్థ క్రమశిక్షణ మరియు శక్తికి నిదర్శనం. జై సియా రామ్" అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను దిగ్విజయ్ సింగ్ కేవలం బీజేపీని పొగడడానికే పరిమితం చేయలేదు. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేష్‌లను ట్యాగ్ చేశారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదని, అంతా 'హైకమాండ్' చుట్టూనే తిరుగుతోందని ఆయన పరోక్షంగా విమర్శించారు. బీజేపీలో ఒక సాధారణ కార్యకర్త కూడా అత్యున్నత స్థాయికి చేరుకోగలరనే విషయాన్ని తన పార్టీ నాయకత్వానికి గుర్తు చేస్తూ ఆయన ఈ 'మైండ్ గేమ్' ఆడారని భావిస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ పోస్ట్‌ను బీజేపీ ఆయుధంగా మార్చుకుంది. బీజేపీ ప్రతినిధి సీఆర్ కేశవన్ స్పందిస్తూ.. "దిగ్విజయ్ సింగ్ నిజం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక కుటుంబం (గాంధీ కుటుంబం) చుట్టూనే తిరుగుతుంది. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, కేవలం నియంతృత్వం మాత్రమే ఉంది. కానీ బీజేపీలో కింది స్థాయి కార్యకర్త కూడా ప్రధాని కాగలడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారు" అంటూ ఎద్దేవా చేశారు. ఈ పోస్ట్ వల్ల పార్టీలో తనపై వ్యతిరేకత వస్తుందని గ్రహించిన దిగ్విజయ్ సింగ్ వెంటనే వివరణ ఇచ్చారు. "నేను మోదీ విధానాలకు, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి వ్యతిరేకమని అందరికీ తెలుసు. నేను కేవలం వారి సంస్థాగత నిర్మాణం, కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యతను మాత్రమే మెచ్చుకున్నాను. ఇందులో రాజకీయ అర్థాలు వెతకవద్దు" అని పేర్కొన్నారు.
సాధారణ కార్యకర్త నేల మీద కూర్చునే స్థాయి నుండి ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి : దిగ్విజయ్ సింగ్ ఎక్స్ ట్వీట్
by Telugu Lo Computer at December 27, 2025
Labels:
Digvijay Singh's X (Twitter) post
,
national
,
rose to become Chief Minister and then the Prime Minister of the country
,
See how an ordinary worker
,
sitting on the ground
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment