హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నామినేషన్ లో సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత డిసెంబర్ 29న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాకుండా ప్రచారంలోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దాదాపు పదహారేండ్ల కింద రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నవీన్ యాదవ్ ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25 వేల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నవంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్.. డిసెంబర్ 29న తొలిసారిగా అసెంబ్లీకి హాజరై నియోజకవర్గ ప్రజా సమస్యలపై గళం విప్పారు.
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు
December 30, 2025
0
Tags