Ad Code

ప్రధాని నరేంద్ర మోడీ సభలో సమోసాల కోసం కొట్లాట : సోషల్ మీడియాలో వీడియో వైరల్


త్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో మాజీ ప్రధాని వాజ్‌పేయి 101వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమం అనూహ్య ఘటనకు వేదికైంది. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సమయంలోని సభకు హాజరైన కొందరు సమోసాల కోసం కొట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్నోలో వాజ్‌పేయి స్మారక చిహ్నాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అదేసమయంలో సభా ప్రాంగణంలో సమోసాల పంపిణీ విషయంలో వివాదం చెలరేగింది. సమోసాలు కొందరికి అందకపోవడంతో మాటామాటా పెరిగి అది కాస్తా కొట్లాటకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ దాడిలో బాధితుడు కుర్చీల వరుసలో పడిపోయాడు. ప్రధాని ప్రసంగిస్తుండగానే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. ఈ ఘటనపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu