హైదరాబాద్ నగర వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఈగల్ టీం దృష్టి సారించింది. డ్రగ్స్ నివారణకు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టింది. నగరంలోని పలు పబ్‌లపై ఈగల్ టీం మెరుపు దాడులు చేసింది. పలు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించింది. కొండాపూర్‌లోని క్వేక్ ఎరేనా పబ్‌లో తనిఖీలు చేశారు. కస్టమర్లకు ర్యాపిడ్ కిట్‌లతో టెస్టులు నిర్వహించారు. 8 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. డిసెంబర్ 19న మాసబ్ ట్యాంక్ వద్ద ట్రూప్‌బజార్‌కు చెందిన ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు తరచుగా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో అమన్‌ప్రీత్ పాత్రను గుర్తించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత ఏడాది నార్సింగి పరిధిలో పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాలోనూ అమన్‌ప్రీత్ కీలకమని గుర్తించారు. ఆయనకు పరీక్షలు చేసి డ్రగ్స్ వినియోగించినట్టు తేల్చారు.
హైదరాబాద్ పబ్బులపై ఈగల్ టీమ్ మెరుపు దాడులు !
by Telugu Lo Computer at December 28, 2025
Labels:
Eagle Team conducts surprise raids on Hyderabad pubs
,
Inspections were conducted at multiple pubs
,
New Year celebrations
,
telangana
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment