స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మూడో దశను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ కేంద్రంలో మంగళవారం ఈ ప్రయోగం నిర్వహించింది. మూడు-దశల ఆల్-సాలిడ్ లాంచ్ వెహికల్ ఎస్‌ఎస్‌ఎల్వీ పనితీరును విశ్లేషించడంతోపాటు డేటాను సేకరించినట్లు ఇస్రో వెల్లడించింది. అంతరిక్షంలోకి చిన్న ఉపగ్రహాలను వేగంగా ప్రయోగించడం కోసం దీనిని రూపొందించారు. అధిక స్థాయిలో ఉత్పత్తికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. పేలోడ్‌కు సెకనుకు 4 కిలోమీటర్ల వేగాన్ని అందించడంలో ఎస్‌ఎస్-3 కీలకపాత్ర పోషిస్తుందని, పేలోడ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చేసిన అప్‌గ్రేడ్‌లు ఈ దశలో మెరుగైన ఇగ్నైటర్, నాజిల్ డిజైన్ ఉపగ్రహాల సామర్థ్యం, నిర్మాణాత్మక దృఢత్వాన్ని పెంచినట్లు తెలిపారు. ఈ పరీక్షలో ఒత్తిడి, థ్రస్ట్, ఉష్ణోగ్రత, వైబ్రేషన్, యాక్యుయేటర్ పనితీరు వంటి విషయాలను పరిశీలించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
0 Comments