ఆగి ఉన్న టిప్పర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు : 22 మందికి గాయాలు
తెలంగాణ లోని సంగారెడ్డి జిల్లా కంది దగ్గర నేషనల్ హైవే 65పై రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు మెదక్ నుంచి పటాన్ చెరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి ముందుగానే శివంపేట దగ్గర స్కూటీని బస్సు ఢీ కొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు. గాయపడిన వాళ్లను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు మెదక్ నుండి పటాన్ చెరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే భారీ ప్రాణనష్టం వాటిల్లేదని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు.
Comments
Post a Comment