తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండల కేంద్రానికి చెందిన మహిళ ఓ యాప్‌ను నమ్మి అందులో విడతల వారీగా డబ్బులు జమ చేసింది. గత మూడు నెలలుగా యాప్‌లో టాస్క్ చేస్తూ వారు కోరిన విధంగా డబ్బులు పంపింది. తాను పెట్టుబడిన పెట్టిన డబ్బులు కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు జమ అయినట్లు ఆ యాప్‌లో సైబర్ మోసగాళ్లు మహిళకు చూపించారు. దీంతో అదంతా నిజమే అని నమ్మి మరికాస్త డబ్బులను జమ చేసింది. చివరకు యాప్‌లో ఉన్న డబ్బులను డ్రా చేయాలని చూసింది. కానీ డబ్బులు డ్రా అవ్వలేదు. దీంతో తాను మోసపోయినట్లు మహిళ గ్రహించింది. దాదాపు రూ.1.68 లక్షలను బాధితురాలు మోసపోయింది. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులను ఆశ్రయించి తాను ఏ విధంగా మోసపోయిందనే విషయాన్ని బాధితురాలు తెలియజేసింది. కేసు నమోదు చేసిన దోమకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యాప్‌ను నమ్మి విడతల వారీగా డబ్బులు జమ చేసి రూ.1.68 లక్షలను మోసపోయిన మహిళ !
Tuesday, December 30, 2025
A woman was cheated out of Rs. 1.68 lakhs after trusting an app and depositing money in installments cyber Criem police registered a case and have launched an investigation telangana
No comments:
Post a Comment