ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ఆదివారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో అభిమానుల తాకిడితో కింద పడిపోయారు. మలేషియా నుండి తిరిగి వచ్చిన ఆయనను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు గుమికూడి ఫొటోల కోసం ఎగబడ్డారు. వ్యక్తిగత భద్రత సిబ్బంది సైతం వారిని అడ్డుకోలేకపోయారు. అభిమానుల మధ్య తోపులాటతో విజయ్ కిందపడ్డారు. వెంటనే భద్రతా సిబ్బంది ఆయనను పైకి లేపి, సురక్షితంగా వాహనంలోకి పంపారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. విజయ్ మలేషియాలో జరిగిన 'జన నాయగన్' ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరై చెన్నైకి చేరుకున్నారు. ఈ నెల 27వ తేదీన కౌలాలంపూర్‌లోని బుకిత్ జలీల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్ష మంది అభిమానులు తరలివచ్చారు. దేశంలో అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన ఆడియో లాంచ్‌గా మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ ఈవెంట్ గుర్తింపు పొందింది. ప్రజా జీవితంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడానికి సినిమా రంగాన్ని వీడాలనే తన నిర్ణయాన్ని విజయ్ పునరుద్ఘాటించారు.
0 Comments