తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారింది. రెండో రోజు మొత్తం రూ.1,11,395 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రావడం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఊతం కానుంది. ఈ పెట్టుబడులతో కొత్త సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా రాబోతున్నాయి. రెండో రోజు పరిశ్రమల విభాగానికే కాదు, పౌరులకు, ఉద్యోగార్ధులకు కూడా ఆశాకిరణాన్ని చూపింది. డేటా సెంటర్ల నుంచి ఫార్మా వరకు, అగ్రిటెక్ నుంచి ఎఫ్ఎంసీజీ వరకు తెలంగాణలో పెట్టుబడుల విస్తరణ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి భారీ బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు..
0 Comments