Ad Code

కోటా-నాగ్డా సెక్షన్‌లో గంటకు 182 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ : రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్


వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. క్రమంగా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీ- వారణాశి, ఢిల్లీ- పాట్నా, ఢిల్లీ- కోటా వంటి కొన్ని మార్గాలు ప్రాథమికంగా ఎంపిక అయ్యాయి. ఆయా మార్గాల్లో ట్రయల్ రన్స్ సాగుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బిగ్ అప్ డేట్ ఇచ్చారు . వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ వేగానికి సంబంధించిన వీడియోను ఆయన తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. గంటకు 180- 182 కిలో మీటర్ల వేగాన్ని అందుకుందీ ట్రైన్. కోటా-నాగ్డా సెక్షన్‌లో గంటకు 182 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు పరుగులు పెట్టింది. దీన్ని పరీక్షించడానికి వాటర్ టెస్ట్ నిర్వహించారు. నీటితో నింపిన మొత్తం నాలుగు గాజు గ్లాస్ లను దీనికోసం వినియోగించారు. ఒక్క చుక్క నీరు కింద పడకుండా గరిష్టంగా 182 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ దూసుకెళ్లడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. రైలు లోపలి నుండి మొబైల్ స్క్రీన్‌పై గంటకు 182 కి.మీ. వరకు దీనీ వేగం నమోదైంది. అంత వేగంలో కూడా డెక్‌పై అమర్చిన నీటి గ్లాసులు కదలకుండా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఛైర్ కార్ రైళ్ల డిజైన్ వేగం 180 కిలోమీటర్లు. కాగా గరిష్ట ఆపరేషనల్ స్పీడ్ 160 కిలోమీటర్లుగా రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. రైలు సగటు వేగం ట్రాక్ జామెట్రీ, మెయింటెనెన్స్, స్టాప్‌ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 16 కోచ్‌లతో వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి రానుంది. 800-1100 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఆటోమేటిక్ డోర్స్, టచ్ ఫ్రీ బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, యూఎస్బీ ఛార్జింగ్, వైఫై, సీసీటీవీ కెమెరాలు, మాడ్యులర్ కిచెన్, కవచ్ సేఫ్టీ సిస్టమ్, క్రాష్ రెసిస్టెంట్ డిజైన్ తో ఇవి రూపుదిద్దుకుంటోన్నాయి.  

Post a Comment

0 Comments

Close Menu